Imperial Blue : చలికాలంలో 17 లక్షల బాటిళ్లు ఖాళీ..రికార్డులు తిరగరాసిన మందుబాబులు.

Imperial Blue : లిక్కర్ మార్కెట్‌లో ఇప్పుడు ఒకే ఒక బ్రాండ్ పేరు మారుమోగిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు మందుబాబులు సాధారణంగా రమ్ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయ్యింది. అందరికీ సుపరిచితమైన ఇంపీరియల్ బ్లూ విస్కీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం ఒకే సీజన్‌లో ఏకంగా 17.9 లక్షల బాటిళ్లు అమ్ముడయ్యాయంటే ఈ బ్రాండ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇంపీరియల్ బ్లూ అనేది ఫ్రాన్స్‌కు చెందిన పెర్నోడ్ రికార్డ్ కంపెనీ బ్రాండ్. అయితే ఇటీవల భారతీయ మద్యం దిగ్గజం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఈ బ్రాండ్‌ను సుమారు రూ.4,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది భారతీయ మద్యం మార్కెట్లోనే అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ మార్పు జరిగిన వెంటనే అమ్మకాలు ఊపందుకోవడం విశేషం. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ హస్తగతం చేసుకున్న తర్వాత వచ్చిన మొదటి నివేదికల ప్రకారం.. ఇంపీరియల్ బ్లూ విస్కీ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీకి చెందిన ఇతర బ్రాండ్లతో కలిపి మొత్తం 13 మిలియన్ల బాటిళ్లను విక్రయించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఎందుకీ రేంజ్ క్రేజ్?
భారతీయ విస్కీ మార్కెట్‌లో ఇంపీరియల్ బ్లూ అనేది మూడవ అతిపెద్ద బ్రాండ్. మన దేశంలో ప్రతి ఏటా విక్రయమయ్యే మొత్తం విస్కీలో ఈ బ్రాండ్ వాటా సుమారు 9 శాతంగా ఉంది. సంవత్సరానికి దాదాపు 2.24 కోట్ల కేసుల విస్కీ అమ్ముడవుతుంటుంది. ఇంతలా ఈ బ్రాండ్ పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం దాని ధర, రుచి. తక్కువ ధరకే ప్రీమియం క్వాలిటీ విస్కీ దొరుకుతుందనే నమ్మకం మందుబాబుల్లో బలంగా ఉంది. అందుకే కొత్త కంపెనీ చేతుల్లోకి వెళ్ళినా దీని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరిగింది.
ధర వింటే షాక్ అవ్వాల్సిందే!
ఇంపీరియల్ బ్లూ ఇంతలా అమ్ముడవ్వడానికి సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలే కారణం. ఢిల్లీ వంటి నగరాల్లో దీని 180ml(క్వార్టర్) బాటిల్ ధర కేవలం రూ.180 మాత్రమే. ఇక పూర్తి బాటిల్ ధర సుమారు రూ.600 లోపు ఉంటుంది. బడ్జెట్ లో దొరికే బెస్ట్ విస్కీగా దీనికి పేరుంది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేయడం లాభసాటి వ్యాపారంగా మారిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. విస్కీ మార్కెట్‌పై పట్టు సాధించేందుకు ఆ కంపెనీ వేసిన స్కెచ్ పక్కాగా పనిచేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
