Muvi 125 5G : ఒక్క చార్జ్‌తో 100కి.మీ. దూసుకెళ్లే సరికొత్త ఈ బైక్

మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో టాప్ బ్రాండ్లు చాలానే ఉన్నాయి. అలాంటి బ్రాండ్లలో ఒకటైన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ మేకర్ ఈబైక్ తన కొత్త 125 మువీ 5జీ ( Muvi 125 5G ) ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
ఈ కొత్త ఈ-స్కూటర్ ఇప్పటికే ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న 4జీ మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతీయ వినియోగదారుల అవసరాలు, వారి కోరుకుంటున్న అంశాలను జోడించి ఈ కొత్త స్కూటర్ తీసుకువచ్చినట్లు ఈబైక్ గో కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా ఉన్నాయి. కొత్త 125 5జీ ఎలక్ట్రిక్ స్కూటర్ 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో ఒకేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది మూడు గంటల సమయంలోనే సున్నా నుంచి 80 శాతం బ్యాటరీ చార్జ్ అవుతుంది.
ఇది మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్ల చార్జింగ్ టైంతో పోల్చితే చాలా తక్కువ సమయం అని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో స్మార్ట్ ఎల్ ఈడీ డిజిటల్ డిస్ ప్లే డ్యాష్ బోర్డు ఉంటుంది. మొబైల్ యాప్ తో కనెక్ట్ చేసిన అనేక ఫీచర్లు ఉంటాయి. మువీ 125 5జీ ఈ స్కూటర్ భారతీయ వినియోగదారులకు సరిగ్గా సరిపోతుందని కంపెనీ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com