iQoo Z9 5G : త్వరలో మార్కెట్ లోకి iQoo Z9 5G

iQoo Z9 5G  : త్వరలో మార్కెట్ లోకి iQoo Z9 5G

iQoo తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. iQoo Z9 5G త్వరలో దేశంలోకి రానుంది. కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ఇండియాలో మైక్రోసైట్ ద్వారా దీన్ని లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. iQoo Z9 5G గత సంవత్సరం చైనాలో ప్రారంభమైంది.

iQoo Z9 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్‌లో ఆస్ఫెరికల్ ప్రీమియం లెన్స్ అండ్ LED ఫ్లాష్ కూడా ఉంటాయి. దీర్ఘచతురస్రాకార డిజైన్‌తో మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ వస్తుంది.

iQoo Z9 5G, MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ద్వారా నడుస్తుంది, ఇది దాని శ్రేణిలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌గా అవుతుందని కంపెనీ పేర్కొంది. గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, ఫోన్ 8GB RAMని కలిగి ఉంటుంది. Android 14-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.. అయితే, ఈ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

మునుపటి లీక్‌ల ప్రకారం iQoo Z9 5G 1.5K OLED డిస్‌ప్లే, 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. బ్లూటూత్ SIG సర్టిఫికేషన్ ప్రకారం, ఫోన్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 91మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ. 25,000లోపు ఉండవచ్చని అంచనా.

Tags

Next Story