Chutneys Hotels : చట్నీస్ హోటళ్లపై ఐటీ దాడులు

Chutneys Hotels : చట్నీస్ హోటళ్లపై ఐటీ దాడులు
X

ఎన్నికల వేళ ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) వరుస ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలోని చట్నీస్‌ హోటల్స్‌పై (Chutneys Hotels) ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హోటల్ యజమాని అట్లూరి పద్మ ఇంటికి కూడా వెళ్లారు ఐటీ అధికారులు. ఇంట్లో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

చట్నీస్ బ్రాంచులు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. సరైన ప్రతాలు లేని నగదు, విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. షర్మిల తనయుడు రాజారెడ్డికి, చట్నీస్ యజమానురాలు పద్మ కుమార్తె ప్రియకు ఇటీవల వివాహం జరిగింది.

ఐటీ దాడులతో పెద్దపెద్ద వ్యాపారస్తుల్లో దడ మొదలైంది. లెక్కలు, పేపర్లు ప్రాపర్ గా ఉండేట్టు చూసుకుంటున్నారు. తమదాకా పరిస్థితి రాకముందే జాగ్రత్తపడుతున్నారు.

Tags

Next Story