Jio Cinema : జియో సినిమా యూజర్స్‌కి బంపరాఫర్

Jio Cinema : జియో సినిమా యూజర్స్‌కి బంపరాఫర్

ముకేశ్ అంబానీ జియో సినిమా ఓటీటీ అనేది దేశంలో ఓ సంచలనం. దీనివల్లే కోట్లాది మంది ఐపీఎల్ ను తమ అరచేతిలో లైవ్ లో చూడగలుగుతున్నారు. ఎన్నో సినిమాలను కూడా ఉచితంగా చూస్తున్నారు. ప్రస్తుతం జియో సినిమాస్ యూజర్స్ అంతా ఈ ఆఫర్ ని యాడ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

సబ్ స్క్రైబర్స్ కు మరో బంపరాఫర్ ఇచ్చారు అంబానీ. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ ని యూజర్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ ఆఫర్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే.. నెలకి రూ.29 చెల్లించి ఒక డివైజ్ లో యాడ్స్ లేకుండా సినిమాలు, మిగతా కంటెంట్ చూడొచ్చు.

ఇక రెండో ఆప్షన్‌లో.. నాలుగు డివైస్ లు కలిసి ఒకే సమయంలో 4కె క్వాలిటీతో చూసేలా అవకాశం కలిపిస్తూ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కోసం నెలకి రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీగా అలవాటు చేసి ఆ తర్వాత పేమెంట్ వసూలు చేసి బిజినెస్ పెంచుకోవడంలో ముకేశ్ అంబానీని మించినవాళ్లు ఉండరు. ఇది కూడా ఓ వ్యాపార సక్సెస్ సూత్రమే అంటున్నారు నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story