RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  కీలక నిర్ణయం

రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు 6.5శాతంగానే కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఆర్బీఐకి ఇదే తొలి ప్రకటన.

2023 ఫిబ్రవరి సమీక్షలో చివరిసారిగా రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం పెంచింది. దీంతో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి చేరింది. అప్పటినుంచి ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సమీక్షల్ని నిర్వహిస్తున్న ఆర్‌బీఐ.. ఈ రేట్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఏడాదికి పైగా రెపో రేటు స్థిరంగా ఉంటుంది.

బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేటునే రెపో రేట్ అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని కూడా అంటారు. దేశంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెపో రేటును ఆర్బీఐ నిర్ణయిస్తుంది. రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకే లోన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story