Petrol and Diesel Price : ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే?

Petrol and Diesel Price : ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే?
Petrol and Diesel Price :పెట్రోల్‌, డీజిల్‌పై 7 చొప్పున తగ్గిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ ప్రకటించారు.

పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడంతో పలు రాష్ట్రాలు అదే దారిలో నడుస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 7 చొప్పున తగ్గిస్తున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలుపుకొంటే అసోంలో పెట్రోల్‌ 12 రూపాయలు, డీజిల్‌ 17 రూపాయలు తగ్గుతోంది. త్రిపురలో సీఎం విప్లవ్‌ దేవ్‌ సైతం పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

కర్నాటకలో పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. తమ రాష్ట్రంలో 7 రూపాయల చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు గోవా సీఎం ప్రమోద్‌ కుమార్‌ తెలిపారు. దీంతో గోవాలో పెట్రోల్‌ ధర 12 రూపాయలు, డీజిల్‌ ధర 17 రూపాయల మేర తగ్గింది. మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ తమ రాష్ట్రంలో పెట్రోల్‌పై 7 రూపాయలు, డీజిల్‌పై 7 రూపాయల వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సైతం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని యూపీలో పెట్రోల్‌, డీజిల్‌ 12 రూపాయల మేర తగ్గనుంది. గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 7 రూపాయల చొప్పున తగ్గించింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను హర్యానా ప్రభుత్వం తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని హర్యానాలో పెట్రోల్, డీజిల్ 12 రూపాయలు తగ్గాయి.

పెట్రోల్‌, డీజిల్‌పై 3 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. బిహార్‌ ప్రభుత్వం పెట్రోల్‌పై రూపాయి 30 పైసలు, డీజిల్‌పై రూపాయి 90 పైసలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై 2 రూపాయలు వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story