LIC : నెలకు రూ.1400 దాచుకుంటే రూ.25 లక్షలు మీ సొంతం..జీవితాంతం ఫ్రీ ఇన్సూరెన్స్.

LIC : నెలకు రూ.1400 దాచుకుంటే రూ.25 లక్షలు మీ సొంతం..జీవితాంతం ఫ్రీ ఇన్సూరెన్స్.
X

LIC : భారతదేశంలో పొదుపు, భద్రత అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు LIC. ఎంతో కాలంగా నమ్మకానికి మారుపేరుగా నిలిచిన ఎల్‌ఐసీ, తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు అదిరిపోయే ప్లాన్లను తీసుకువస్తోంది. అందులో ఒకటే జీవన్ ఆనంద్ పాలసీ (ప్లాన్ నంబర్ 915). తక్కువ పొదుపుతో భారీ లాభాన్ని పొందాలనుకునే వారికి, అలాగే కుటుంబానికి జీవితాంతం భీమా రక్షణ ఉండాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ పాలసీ విశేషాలేంటో తెలుసుకుందాం.

చాలామంది ప్రీమియం ఎక్కువగా ఉంటుందని పాలసీలు తీసుకోవడానికి భయపడుతుంటారు. కానీ, జీవన్ ఆనంద్ ప్లాన్ సామాన్యుల బడ్జెట్‌కు తగ్గట్టే ఉంటుంది. ఉదాహరణకు.. 35 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల బీమా మొత్తం కోసం 35 ఏళ్ల కాలపరిమితితో ఈ పాలసీ తీసుకుంటే, సంవత్సరానికి సుమారు రూ.16,300 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు కేవలం రూ.1400 మాత్రమే. దీనిని రోజువారీ లెక్కన చూస్తే సుమారు రూ.46 ఆదా చేస్తే సరిపోతుంది. ఇలా పాలసీ గడువు ముగిసేసరికి మీరు దాదాపు రూ.5.70 లక్షలు జమ చేస్తారు. కానీ, పాలసీ మెచ్యూరిటీ సమయానికి బోనస్‌లతో కలిపి మీకు సుమారు రూ.25 లక్షల భారీ మొత్తం అందుతుంది.

ఎల్‌ఐసీ ట్యాగ్‌లైన్ జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ ఈ పాలసీకి పక్కాగా సరిపోతుంది. సాధారణంగా ఏ పాలసీ అయినా గడువు ముగిసి, డబ్బులు చేతికి రాగానే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ముగుస్తుంది. కానీ జీవన్ ఆనంద్‌లో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు తీసుకున్నా సరే.. మీకు భీమా రక్షణ పోదు. పాలసీదారుడికి 100 ఏళ్లు వచ్చినా, లేదా ఎప్పుడు చనిపోయినా వారి కుటుంబానికి (నామినీకి) అదనంగా మరో రూ.5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. అంటే ఒకే పాలసీతో రెండుసార్లు బెనిఫిట్ అన్నమాట.

ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం రిటర్న్స్ మాత్రమే కాదు, పన్ను ఆదా కూడా చేసుకోవచ్చు. మీరు చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో వచ్చే రూ.25 లక్షలు కూడా సెక్షన్ 10(10D) కింద పూర్తిగా టాక్స్ ఫ్రీ. ఒకవేళ అత్యవసరంగా డబ్బు అవసరమైతే, పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత దీనిపై లోన్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్రమాద వశాత్తూ మరణిస్తే వచ్చే యాక్సిడెంటల్ డెత్ వంటి అదనపు రైడర్లను కూడా ఈ ప్లాన్‌కు జోడించుకోవచ్చు.

18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న వారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. మీ అవసరాలకు అనుగుణంగా 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు పాలసీ టర్మ్‌ను ఎంచుకోవచ్చు. నెలకు ఒకసారి, మూడు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్, జీవితాంతం ఇన్సూరెన్స్ కావాలనుకుంటే జీవన్ ఆనంద్ కంటే బెస్ట్ ప్లాన్ మరొకటి ఉండదు.

Tags

Next Story