Manayatri App : క్యాబ్‌లో ఫ్యామిలీ టూర్లు వేస్తున్నారా... 'మనయాత్రి' యాప్ వచ్చేసింది

హైదరాబాద్‌లో (Hyderabad) తొలిసారిగా జీరో కమిషన్ ఆధారిత ఆటో క్యాబ్ యాప్ 'మనయాత్రి'ని ప్రారంభించారు. టీహబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, డ్రైవర్ల యూనియన్ల సభ్యులు, సాంకేతిక నిపుణులు పలువురు పాల్గొన్నారు. డ్రైవర్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు.. ఈ యాప్ ద్వారా నగర ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్‌లో భాగమైన ఈ యాప్ బెంగళూరులోని టీహబ్‌లో రూపొందించారు. బెంగళూరులో 'నమ్మ యాత్ర' పేరుతో యాప్‌ను ప్రారంబించగా.. అక్కడ ఈ యాప్‌కు మంచి ప్రజాదరణ లభించింది. దాంతో.. హైదరాబాద్ నగరంలో కూడా దీన్ని ప్రారంభించారు. హైదరాబాద్ టీ-హబ్‌లోని బృందం నుంచి ఇన్ పుట్స్, సపోర్ట్ తో అదే సంస్థ ఈ యాప్‌ను ఇక్కడా రూపొందించింది.
హైదరాబాద్‌లో క్యాబ్ లకు ఉండే గిరాకీ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగర సంస్కృతి, ఇక్కడి సాంకేతికత నిపుణులకు 'మనయాత్రి' యాప్ సరిగ్గా సరిపోతుందని నిర్వాహకులు చెప్పారు. మనయాత్రి యాప్ ఇప్పటికే హైదరాబాద్‌లో 25వేల మందికి పైగా డ్రైవర్లను చేర్చుకుందని తెలిపారు. జూన్ కల్లా మరో లక్షల మందిని చేర్చుకోనున్నారు. www.nammayatri.in సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com