Meta : హానికర కంటెంట్ పై మెటా చర్యలు

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ యొక్క మాతృ సంస్థ మెటా (Meta) జనవరి 2024లో భారతదేశంలో Facebook నుండి 17.8 మిలియన్లకు పైగా, Instagram నుండి 4.8 మిలియన్లకు పైగా హానికరమైన కంటెంట్‌లను తొలగించినట్లు వెల్లడించింది.
వినియోగదారు నివేదికలు, ఫిర్యాదులు
జనవరిలో, ఫేస్‌బుక్‌కు 29,548 ఫిర్యాదులు అందగా, ఇన్‌స్టాగ్రామ్‌కు భారతీయ ఫిర్యాదుల యంత్రాంగం ద్వారా 19,311 నివేదికలు వచ్చాయి.
సమస్య పరిష్కారం కోసం సాధనాలు
ఫేస్‌బుక్‌లో 21,060 కేసులు, ఇన్‌స్టాగ్రామ్‌లో 9,476 కేసులలో సమస్య పరిష్కారం కోసం ఉన్న మెటా టూల్స్ యూజర్స్ కు తమ సమస్యలను పరిష్కరించడానికి అనుమతిస్తుంది.
ప్రత్యేక పరిశీలన తర్వాత చర్యలు
Facebookలో మొత్తం 8,488, Instagramలో 9,835 ఫిర్యాదులకు ప్రత్యేక సమీక్ష అవసరం. కావున మెటా ఈ కంటెంట్‌ను విశ్లేషించింది. 4,632 Facebook ఫిర్యాదులు, 4,849 Instagram ఫిర్యాదులపై చర్య తీసుకుంది. మిగిలిన ఫిర్యాదులను సమీక్షించినా చర్యలు తీసుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com