New Digital Payments : కొత్త డిజిటల్ పేమెంట్స్.. పిన్ లేకుండానే చెల్లింపులు

New Digital Payments : కొత్త డిజిటల్ పేమెంట్స్.. పిన్ లేకుండానే చెల్లింపులు
X

స్మార్ట్ ఫోన్ తో డిజిటల్ చెల్లింపుల్లో కొత్త పద్ధతులు వస్తున్నాయి. యూపీఐ లైట్ వచ్చిన తరువాత ఇంటర్ నెట్ లేకుండా చెల్లింపులు చేసేందుకు అవకాశం వచ్చింది. ఫోన్ స్విచాఫ్ అయినా.. డెడ్ అయినా కూడా చెల్లింపులు చేసేలా కొత్త టెక్నాలజీ వచ్చేసింది.

ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డుల్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పని చేస్తుంది. కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకు ఇటీవల ఫెడరల్ బ్యాంక్ ఫ్లాష్ పే పేరుతో రూపే స్మార్ట్ కీచైన్ ను తీసుకు వచ్చింది. ఈ తరహా సేవల కోసం చిన్న డివైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది నియో గ్రూప్. నియోఫినిటీ నియోజాప్ అనే వర్చువల్ బ్యాంక్ కార్డ్ లాంటి పరికరాన్ని తీసుకువచ్చింది. ఇది ఒక ఎన్ఎఫ్ సీ ట్యాగ్ డివైస్. సిమ్ కార్డులా అనిపిస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అతికించవచ్చు. ఫోన్ చార్జింగ్ లేకపోయినా చెల్లింపు చేయాలంటే నియో జాప్ స్టిక్కర్ ను ట్యాప్ చేస్తే సరిపోతుంది.

మెట్రో, బస్ ఛార్జీలు, పెట్రోల్ బంక్ పేమెంట్స్ ఇలా అన్ని రకాల చెల్లింపులను దీని ద్వారా జరపవచ్చు. యూపీఐ లైట్ మాదిరిగానే 2వేల రూపాలయ వరకు దీని ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. యాప్ ద్వారా కంట్రోల్ చేసే సదుపాయం కూడా ఉంది. సాధారణ యూపీఐ పేమెంట్స్, డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపుల కంటే సులభంగా ఎటువంటి అంతరాయం లేకుండా లావాదేవీ లు జరపవచ్చని కంపెనీ తెలుపుతోంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Tags

Next Story