NOKIA 3210 : నోకియా 3210 మళ్లీ వచ్చేసింది..

మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. HMD గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.
25 ఏండ్ల క్రితం 1999లో మార్కెట్లోకి వచ్చిన ఇదే ఫోన్ తాజాగా నోకియా అభిమానులను ఆలరించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ ధర రూ.3,999గా నిర్ణయించింది హెచ్ఎండీ గ్లోబల్. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, హెచ్ఎండీ ఈ-స్టోర్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. వై2కే గోల్డ్, స్కూబా బ్లూ, గ్రుంజ్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
1450 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో 9.8 గంటల టాక్ టైం ఉంటుంది. యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com