OYO : ఓయో కంపెనీ తొలిసారి రూ.100 కోట్ల లాభం

ఓయో కంపెనీ తొలిసారి రూ.100 కోట్ల నికర వార్షిక లాభాన్ని ఆర్జించిందని ఆ సంస్థ సీఈవో రితేశ్ అగర్వాల్ వెల్లడించారు. 2023-24లో రూ.100 కోట్ల లాభం వచ్చిందని, ఓయో లాభాన్ని నమోదు చేసిన తొలి ఆర్థిక సంవత్సరం ఇదేనని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయన్నారు. కాగా, 2023-24 ఆదాయ గణాంకాలను వెల్లడించనప్పటికీ.. ఓయో ఆదాయం రూ.5,800 కోట్లు ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ ఇదివరకు నివేదించింది.
2023- 24 లో ఓయో నికర లాభం రూ. 99.6 కోట్లుగా నమోదైంది. ఎబిటా కూ 2022- 23 లోని రూ. 274 కోట్ల నుంచి గణనీయంగా పెరిగి రూ. 888 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా సుమారు 5 వేల హోటళ్లు, 6 వేల హోమ్స్‌ను సంస్థ జత చేసుకుంది. మున్ముందు భారత్‌లోనే కాకుండా నార్డిక్స్, ఆగ్నేయాసియా, అమెరికా, బ్రిటన్ లాంటి కీలక మార్కెట్లలోనూ కంపెనీ వృద్ధిని నమోదు చేస్తోందని రితేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక వ్యాపార పర్యటనలు, సమావేశాలు, డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటి ధోరణులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా 2024- 25 ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేస్తామని అశాభావం వ్యక్తం చేశారు రితేశ్ అగర్వాల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com