Patanjali : 14 ఉత్పత్తుల సేల్స్ ఆపేసిన పతంజలి

తమ సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల సేల్స్ నిలిపివేసినట్లు పతంజలి సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వీటికి సంబంధించిన యాడ్స్‌ను తొలగించాలని మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సమాచారం అందించినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీటి లైసెన్స్‌లు క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. శ్వాసరీ గోల్డ్, లిపిడోమ్, మధుగ్రిట్, బీపీగ్రిట్, లివామ్రిత్ అడ్వాన్స్, లివోగ్రిట్ మొదలైన ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి.
తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టు విచారణను ఎదుర్కొంటోంది. దానిలోభాగంగా తప్పుదోవ పట్టించేలా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారని నిర్ధరణ అయిన నేపథ్యంలో పతంజలిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు చెందిన 14 రకాల ఉత్పత్తులు, అనుబంధ విభాగం దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సును రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఆయుర్వేద సంస్థ నుంచి స్పందన వచ్చింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com