Paytmలో త్వరలో ఈ సర్వీసులు బంద్

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం గడువు పొడిగించారు. సంస్థ చైర్మన్ స్టేట్ మెంట్ ఇచ్చినప్పటికీ... ఏ సేవలు కొనసాగుతాయి.. ఏవి బ్యాన్ అవుతాయి అనేదానిపై క్లారిటీ లేదు. మార్చి 15 తర్వాత వాలెట్, ఫాస్టాగ్ లాంటి కొనసాగే సేవలకు సంబంధించి కీలక సమాచారం తెలుసుకోండి. దీనిపై కంపెనీ ఎఫ్ఏక్యూను కూడా అందుబాటులో ఉంచింది.
ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌ల కోసం పేటీఎం యాప్‌ని ఉపయోగించడం కొనసాగించవచ్చని కంపెనీ తన తాజా FAQలో తెలిపింది. పేటీఎం బ్యాంక్ పై నిషేధం ఉన్నప్పటికీ.. ICICI, HDFC, లాంటి ఇతర బ్యాంకుల నుంచి కూడా పేటీఎం చేయొచ్చు.
మార్చి 15 తర్వాత కూడా కంపెనీ సమాచారం ప్రకారం, Paytm QR కోడ్, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషీన్ ఎప్పటిలాగే పనిచేస్తాయి. పేటీఎం వాలెట్‌లో బ్యాలెన్స్ అందుబాటులో ఉండే వరకు మీరు ఉపయోగించడం, విత్ డ్రా చేసుకోవడం, ఆ మనీని వేరే వాలెట్ కు ట్రాన్స్ ఫర్ చేయడం చేయొచ్చు. Paytm పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన FASTag / NCMC కార్డ్‌ని ఉపయోగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత వీటిని రీఛార్జ్ చేయలేరు. మిగిలిన మొత్తం ఏదైనా ఉంటే దాన్ని.. Paytm పేమెంట్స్ బ్యాంక్ ను రీఫండ్ చేయమని అడగొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com