RBI : వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లు 6.5 శాతంగానే కొనసాగనున్నట్టు ప్రకటించింది.
గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5 శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా ఏడో సారి. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024 - 2025) ఆర్‌బీఐకి ఇదే తొలి ప్రకటన. 5:1 ఓట్ల మెజారిటీతో ఈ ద్రవ్య విధాన నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
భారత్‌కు ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితి చేయాల్సిన అవసరం ఉందని, ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగిందని చెప్పారు. అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ ఎంపీసీ తదుపరి మీటింగ్ వరకు ఇదే రేట్ కొనసాగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com