Realme C16 : రియల్ మీ నుంచి సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో రియల్ కొత్త ఫోన్ ను రిలీజ్ చేసింది. సీ61 పేరిట తీసుకొచ్చిన ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లు, రెండు రంగుల్లో లభిస్తోంది. రియల్ సీ61లో 90 హెడ్జ్ రీఫ్రెష్ రేటు, 450 నిట్స్ బ్రైట్ నెస్ తో కూడిన 6.78 అంగుళాల హెచ్+ ఎల్సీడీ స్క్రీన్ ఇందులో ఉంది.
యూనిసాక్ టీ 612 ప్రాసెసర్ ను పొందుపర్చారు. వెనక డెప్త్ సెన్సర్ తో కూడిన 32ఎంట్ కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో 5 ఎంపీ కెమెరాను ఇచ్చారు. వైఫై 2.4 జీహెడ్
5 జీహెచ్ఎడ్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడిన 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 4జీ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తోంది. ఈ ఫోన్ సఫారీ గ్రీస్, మార్బుల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అమ్మకం ధర రూ.8,999. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.8,499. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,699గా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com