RBI : వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ

రెపోరేటులో ఆర్బీఐ ( RBI ) ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వడ్డీరేటు 6.5శాతంగా ఉంది. దాన్నే కంటిన్యూ చేస్తూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుమారు ఏడాదిగా వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతోంది.
రిజర్వ్ బ్యాంక్ దేశంలోని బ్యాంక్లకు డబ్బులను అప్పుగా ఇస్తుంది. ఆ అప్పుపై వడ్డీని వసూలు చేస్తుంది. దానినే రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగితే.. అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి బ్యాంక్లకు కష్టమవుతుంది. అందుకే బ్యాంక్లు కూడా వివిధ లోన్లపై వడ్డీని పెంచుతాయి. ఇది కస్టమర్లను ప్రభావితం చేస్తుంది.
రెపో రేటు తగ్గితే.. ఆర్బీఐకి బ్యాంక్లు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. తద్వారా ప్రజలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు దిగొస్తాయి. ఇక రెపో రెట్లు మారకపోవడంతో ప్రస్తుతం దేశంలో ఉన్న వివిధ లోన్లపై వడ్డీ రేట్లు కూడా పెద్దగా మారే అవకాశం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com