చెలరేగిపోతున్న అల్లం, వెల్లుల్లి రేట్లు
రోజూ మనం వంటింట్లో ఉపయోగించే అల్లం, వెల్లుల్లి రేట్లు ఎన్నడూ లేనట్టుగా భారీగా పెరిగిపోయాయి. ఇవి వేస్తేనే కానీ టేస్ట్ రాదు. ఐనప్పటికీ జనం పక్కనపెట్టడమో.. తక్కువ వాడుకోవడమో జరుగుతోంది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో ధర రూ.500 టచ్ చేసింది. అల్లం కూడా కిలో రూ.300 నుంచి రూ.350కి చేరింది. రెండు వారాల్లోనే వీటి ధరలు డబుల్ అయ్యాయి.
దేశవ్యాప్తంగా అల్లం, వెల్లుల్లి ధరలు గత నవంబర్ నుంచి పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్‌లో హోల్‌సేల్ మారెట్‌లో మంచి వెల్లుల్లి ధర రూ.250 ఉండగా రిటైల్ మారెట్‌లో రూ.400 వరకు ఉండేది. ఇప్పుడు కిలో రూ.450 నుంచి రూ.500కి పెరిగింది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకు అల్లం రేటు పలుకుతోంది.
హైదరాబాద్ ఉస్మాన్‌గంజ్ లాంటి హోల్‌సేల్ మార్కెట్లలో ధర చూసి జనం షాకవుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బతినడం... దిగుబడి తగ్గిపోవడంతో రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. డిమాండ్‌కు తగిన సైప్లె లేకపోవడంతో అల్లం, ఎల్లిపాయ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరో రెండు నెలల్లో కొత్త పంట వస్తుంది. అప్పటిదాకా ఈ రేట్ల మంట భరించాల్సిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com