Gold Prices : తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంతంటే ?

Gold Prices : తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన ధరలు.. తులం ఎంతంటే ?

బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్స్ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.380 పెరిగి రూ.72,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.350 పెరిగి 66,100గా నమోదైంది. సిల్వర్ రేట్ కూడా అస్సలు తగ్గడం లేదు. తాజాగా కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.89,000కు చేరింది. అంతకుముందు రోజు ఇది రూ. 1800 మేర పెరిగింది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు.. ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయని చెప్పొచ్చు.

ఇక దేశ‌వ్యాప్తంగా చూస్తే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,110 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.72,110 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,150.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..66,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,260 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66,100, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.72,110 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

Tags

Read MoreRead Less
Next Story