River EV Two-Wheeler : మార్కెట్లోకి రివర్ ఈవీ టూవీలర్..

River EV Two-Wheeler : మార్కెట్లోకి రివర్ ఈవీ టూవీలర్..

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ రివర్ తన మొదటి షోరూమ్ ను హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ప్రారంభించింది. కంపెనీ ఇండీ పేరుతో విద్యుత్ స్కూటర్ ను విక్రయిస్తోంది. తమకు రూ.550 కోట్ల ఫండింగ్ దశలవారిగా వచ్చిందని రివర్ ఈవీ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ మనీ తెలిపారు.

బెంగళూర్ కంపెనీ తయారీ ప్లాంట్ తో పాటు, ఆర్ అండ్ డి సెంటర్ కలిగి ఉందని చెప్పారు. బెంగళూర్ లో ప్రస్తుతం కంపెనీకి రెండు షోరూమ్ లు ఉన్నాయని, మూడో షోరూమ్ ను హైదరాబాద్లో ప్రారంభించినట్లు చెప్పారు. బెంగళూర్లో త్వరలోనే మరో రెండు షోరూమ్ లు ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే 500 బుకింగ్స్ వచ్చాయని, మొదటి రోజు 30 కస్టమర్లకు స్కూటర్లను డెలివరీ చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ నాటికి చెన్నై తో సహా 8 కొత్త షోరూమ్స్ ను, 2025 మార్చి నాటికి 50 డీలర్ షిఫ్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో రెండు నుంచి 4 షోరూమ్స్ ను, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, విజయవాడ, గుంటూరులో ఒక్కో షోరూమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక ఛార్జింగ్ తో ఇండీ స్కూటర్ 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తుందని ఇస్తుందని తెలిపారు. ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర 1,40,000 రూపాయలు. 2028 మార్చి నాటికి మరో మోడల్ స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకు వస్తామని తెలిపారు.

Tags

Next Story