Tata Altroz Racer : టాటా కొత్త ఆల్ట్రోజ్ రేసర్ ఫీచర్స్ ఇవే

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కొత్త ఆల్టోజ్ రేసర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్పోర్టీ లుక్ లో వచ్చిన కొత్త ఆల్టోజ్ ఎక్స్ షో రూమ్ ధర 9.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
ఆర్1, ఆర్ 2, ఆర్ 3 పేరుతో మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ తో పోలిస్తే ఆర్ 2 ధర రూ.లక్ష ఎక్కువ. ఆర్3 ధర రూ.లక్షన్నర ఎక్కువ. ప్యూర్ 'గ్రే, అటామిక్ ఆరెంజ్ అవెన్యూ రంగుల్లో ఈ కారు లభిస్తుంది. క్రొత్త అల్టోజ్ లో ఎక్స్ పీరియన్స్, ఇంటీరియర్ పరంగా చాలా మార్పులు చేశారు. బ్లాక్ కలర్ బానెట్ రేసింగ్ లుక్ కోసం ఇచ్చిన లైన్స్ కారుకు పూర్తి స్పోర్టీ లుక్ ను అందిస్తున్నాయి.
360 డిగ్రీల కెమెరా, వెంటిలేడెట్ ఫ్రంట్ సీట్స్ తో ఈ కారును తీసుకువచ్చారు. 10.25 అంగుళాల టచ్ స్క్రీస్, ఇన్ఫోటైన్ మెంట్ సి స్టైమ్ అమర్చారు. భద్రతా పరంగా ఏబీఎస్, ఎస్ఎస్సీ, ఆర్ ఎయిర్ బ్యాగ్ లను అందిస్తున్నారు. ఆల్టోజ్ రేసర్ 1.2 లీటర్, 3 సిలండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో ఈ కారును తీసుకువచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com