Car : మిడిల్ క్లాస్ వారిని ఫిదా చేస్తున్న కారు ఇదే!

Car : మిడిల్ క్లాస్ వారిని ఫిదా చేస్తున్న కారు ఇదే!

ఓ కారుండాలి.. అందులో తమ చిన్న ఫ్యామిలీని ఊరంతా తిప్పాలి అనేది మిడిల్ క్లాస్ వారి కల. అలా మిడిల్ క్లాస్ వారిని ఆకట్టుకునేలా మోడల్స్ ను రిలీజ్ చేస్తుంటాయి కంపెనీలు. మారుతున్న కాలం, అభిరుచులకు తగ్గట్టుగా.. మిడిల్ రేంజ్ లోనే మంచి ఫీచర్లు కూడా తీసుకొస్తున్నాయి కంపెనీలు.

మారుతి అంటేనే మన్నిక పెట్టింది పేరు. ఎన్నో ఆకట్టుకున్న మోడళ్లు మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీ నుంచి లో బడ్జెట్ కార్లు ఎక్కువగా వస్తాయని చాలా మంది నమ్మకం. మారుతికి చెందిన ఆల్టో కే 10 ను బాగా ఇష్టపడుతున్నారు. 2024 జనవరి లో ఈ మోడల్ 12,395, ఫిబ్రవరిలో 11,723, మార్చిలో 9,332 యూనిట్లను సేల్ చేసింది. మిగతా కార్ల కంటే వీటి సేల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రతీ నెల దాదాపు 10 వేల కార్ల వరకు విక్రయాలు జరుపుకుంటోంది.

ఆల్టే కే10లో పవర్ విండోస్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ABS , ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో నడిచే ఈ కారు సీఎన్ జీలో 34 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. ఈ కారు బేస్ మోడల్ ప్రారంభ ధర రూ.3.99 లక్షలు. ఎక్స్ షోరూం ధర రూ.5.96 లక్షలతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మోడల్ సీఎన్ జీ వెర్షన్ లో రూ.6.56 లక్షల వరకు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story