UPI Payments : అకౌంట్‌లో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్స్

UPI Payments : అకౌంట్‌లో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్స్
X

దేశంలోమ యూపీఐ చెల్లింపుల విధానం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉంటేనే యూపీఐ చెల్లింపులు చేసేందుకు వీలు ఉండేది. అయితే త్వరలో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయటానికి అవకాశం రాబోతోంది.

రానున్న రోజుల్లో యూజర్లు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా సులభంగా యుపీఐ చెల్లింపులు చేయగలుగుతారు. యూపీఐ ఉపయోగించే కస్టమర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ 9 నెలల క్రితమే ప్రకటించారు. ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత వినియోగదారుల యూపీఐ ఖాతా క్రెడిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ ఖాతాను ఉపయోగించే కస్టమర్ కు ముందస్తుగా ఓకే చేయబడిన రుణం.

ప్రతి కస్టమర్ తన సిబిల్ స్కోర్ ప్రకారం క్రెడిట్ లైన్ పొందుతారని కార్పొరేషన్ చెబుతోంది. దీని ద్వారా బిజినెస్ ఖాతాలకు మాత్రమే చెల్లింపులు చేయగలుగుతారు. ఈ క్రెడిట్ లైన్ వినియోగించుకున్నందుకు బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లు పేమెంట్ కార్పొరేషన్ లో చేరడానికి ఓకే చెప్పాయి.

Tags

Next Story