Stock Market : స్టాక్ మార్కెట్‌లో విరాట్, అనుష్కలకు జాక్ పాట్

ఆన్లైన్లో ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించే గో డిజిట్ ఇన్సూరెన్స్ లిమిటెడ్.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయింది. షేరు ఇష్యూ ధర రూ. 272.3.35 శాతం ప్రీమియంతో గో డిజిట్ షేర్లు 281 రూపాయల వద్ద లిస్టయ్యాయి. ఇంట్రాడేలో మరింత లాభపడింది.
ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టన్ విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క. మార్కెట్లో ప్రీమియంతో లిస్టు అవ్వడంతో ఈ దంపతులు జాక్ పాట్ కొట్టారు. వీరి పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్ని పొందారు.
విరాట్ కోహ్లి ఒక్కో షేరు 75 రూపాయల ధరతో 2020లో 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అనుష్క 50 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇద్దరి పెట్టుబడి 2.5 కోట్లు. లిస్టింగ్ తరువాత గో డిజిట్ కంపెనీ షేరు విలువ 300 దాటింది. అంటే విరాట్ దంపతులు పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్లు లాభం లభించింది. ఐపీఓలో విరాట్ కోహ్లి దంపతులు తమ వాటాలను విక్రయించలేదు. కోహ్లి గో డిజిట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీలో ఒక్కో షేరు 114 రూపాయల చొప్పున 4.3 లక్షల షేర్లును కొనుగోలు చేశారు. ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయిన తరువాత ఒక్కో షేరు ధర రూ.720 కు చేరడంతో ఆయన పెట్టుబడి అనేక రేట్లు పెరిగింది. క్రికెటర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీలు ఇలా తమ సంపాదన పెంచుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com