Vivo T3 Lite 5G : రూ.10 వేలకే వివో నుంచి 5జీ ఫోన్

Vivo T3 Lite 5G : రూ.10 వేలకే వివో నుంచి 5జీ ఫోన్
X

వివో టీ3 లైట్ ( Vivo T3 Lite ) పేరిట వచ్చిన 5జీ ఫోన్ ను చౌక ధరకు అందుబాటులోకి తెచ్చింది వివో సంస్థ. ఐపీ 64 ప్రొటెక్షన్ తో వచ్చిన వివో టీ3 లైట్ 5జీ.. వైబ్రెంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14తో పని చేస్తుంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్ దీంట్లో ఉంది. 4 ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ .. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లలో అవైలబుల్ గా ఉంది. వర్చువల్ గా ర్యామ్ ను వరుసగా మరో 4జీబీ, 6జీబీ వరకు విస్తరించుకోవచ్చు. స్టోరేజ్ ను 1టీబీ వరకు ఎక్స్ టర్నల్ ఎస్డీ కార్డుతో పెంచుకో వచ్చు. 15W ఛార్జింగ్ సపోర్ట్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.

90 రీఫ్రెష్ రేట్ , 840 నిట్స్ పీక్ బ్రైటెనెస్ తో కూడిన 6.56 అంగుళాల ఎలిసేడీ తెర ఇందులో ఉంది. వెనకభాగంలో ఎఫ్/1.8 (50 ఎంపీ) + ఎఫ్/2.4 (2 ఎంపీ).. ముందుభాగంలో ఎఫ్/2.0 (8ఎంపీ) కెమెరాను పొందుపర్చారు.

4 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.10,499, 6 జీబీ + 128 జీబీ ధర రూ.11,499. జులై 4 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంది. పలు బ్యాంక్ సంస్థల కార్డులపై రాయితీ ఉంది.

Tags

Next Story