Vodafone Idea : బిగ్ షాక్.. వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంపు

వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు జులై 4 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో రూ.179 రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి పెరగనుంది. ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీల టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్, ఎయిర్‌టెల్ జులై 3 నుంచి కొత్త రేట్లను అమలు చేయనుండగా.. ఇక్కడ జులై 4 నుంచి ఉంది.
ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్‌లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు.
ఇదే సమయంలో యాడ్ ఆన్ ప్లాన్ రేట్లు కూడా పెంచింది వీఐ. 1GB అదనపు డేటా కోసం గతంలో రూ. 19 గా ఉండగా.. ఇప్పుడు అది రూ. 22 కు చేరింది. 3 రోజుల యాడ్ ఆన్ ప్లాన్ రూ. 39 నుంచి 48 రూపాయలకు పెరిగింది. ఇక్కడ 6GB డేటా వస్తుంది. 56 రోజుల వ్యవధి ఉన్న రూ. 479 ప్లాన్ రేటు ఇప్పుడు రూ. 579 కి పెరిగింది. ఇక్కడ డైలీ 1.5 GB డేటా వస్తుంది. రూ. 539 ప్లాన్ 56 రోజులపై ఇప్పుడు రూ. 649 కి మారింది. దీంట్లో డైలీ 2GB డేటా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com