Baby Movie : 100 మిలియన్లు.. 'బేబీ' మరో సెన్సేషనల్ రికార్డ్

కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న మూవీ బేబీ. ఈ మూవీకి యూత్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పాటలు, సీన్లకు విపరీతమైన గిరాకీ ఉంది. ఈ మూవీలో నటులకు సెపరేట్ ట్రాక్ రికార్డ్ సొంతం. అలా.. సెన్సేషనల్ సూపర్ హిట్ మూవీ 'బేబీ' మరో రికార్డ్ ను స్వంతం చేసుకుంది.
సినిమా ప్రారంభంలో వచ్చే 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా..' పాట యూట్యూబ్‌లో ఇప్పటికీ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ పాట 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది.
ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వం వహించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో దర్శకుడు సాయి రాజేష్ ఈ లవ్ స్టోరీ మూవీని తెరకెక్కించారు. ఈ పాట యూత్ ను బాగా ఆకట్టుకుంది. రోజూ ఎక్కడో అక్కడ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. చాలామంది డయలర్ టోన్లు, రింగ్ టోన్లు పెట్టుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉంటాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com