BREAKING : హేమకు 14 రోజుల కస్టడీ.. ముసుగు లేకుండా ఫస్ట్ లుక్

BREAKING : హేమకు 14 రోజుల కస్టడీ.. ముసుగు లేకుండా ఫస్ట్ లుక్
X

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమకు ఈనెల 14 వరకూ జుడీషియల్ కస్టడీ విధించింది అక్కడి కోర్టు.

ఈ ఉదయం బుర్ఖాలో బెంగళూరు పోలీసుల విచారణకు హాజరైంది హేమ. ఎవరూ గుర్తుపట్టకుండా అలా విచారణకు వచ్చారని కొందరు సన్నిహితులు తెలిపారు. ఐతే.. ఎంక్వైరీలో రూల్స్ ఫాలో అయ్యారు పోలీసులు. రోజంతా విచారించిన స్పెషల్ పార్టీ పోలీసులు.. ఆమెను హెబ్బగుడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా తొలిసారి ఏ ముసుగూ లేకుండా హేమ బెంగళూరు పోలీసుల అదుపులో కనిపించారు. తాను ఏ తప్పూ చేయలేదని.. నిర్మాతలు పిలిస్తేనే బెంగళూరు వచ్చానని ఆమె చెప్పారు. తనపై బెంగళూరు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కోర్టు నుంచి బయటకొచ్చిన హేమ..తాను ఏ తప్పూ చేయలేదని మీడియాకు చెప్పుకుంటూ వెళ్లింది.

Tags

Next Story