Venky Movie : 'వెంకీ'కి 20 ఏళ్లు.. శ్రీను వైట్ల స్పెషల్ ట్వీట్

మాస్ మహారాజా రవితేజ (Raviteja) నటించిన 'వెంకీ' సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) ట్వీట్ చేశారు. 'ఈ సినిమాతో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. రవితేజ తన పాత్రను పోషించిన తీరు అద్భుతం. నటి స్నేహ, దేవిశ్రీ ప్రసాద్, గజాలా పాత్రలో బ్రహ్మానందం, గోపీమోహన్లకు థ్యాంక్స్. రీరిలీజ్ూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది' అని ఆయన తెలిపారు. ‘వెంకీ రీరిలీజ్ తర్వాత ప్రేక్షుకుల స్పందన చూసి వెంకీ-2 చేయాలనిపించింది. స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా ఉంటుంది కానీ ఎప్పుడని చెప్పలేను’ అని ఆయన తెలిపారు.
ఈ సినిమాకు ముందుగా హీరోయిన్‌గా ముందుగా అసిన్ ను అనుకున్నట్లుగా శ్రీనువైట్ల చెప్పారు. కానీ అది ఎందుకో కుదర్లేదన్నారు. ట్రైన్ సీన్స్‌లో కమెడియన్ ఎం.ఎస్.నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. ‘‘ఈ చిత్రం విడుదలకు ముందు ‘ట్రైన్ సీక్వెన్స్’ వర్కౌట్ కాదేమోనని కొందరు సందేహించారు. కానీ, మా టీమ్ ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది. ‘వెంకీ’ బాగుందని చిరంజీవి సర్ చెప్పడమే ఈ సినిమా విషయంలో నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్’ అని తెలిపారు. దర్శకుడిగా శ్రీను వైట్లకు ఇది ఐదో చిత్రం కాగా ఆయన, హీరో రవితేజ కాంబినేషన్‌లో రెండో సినిమా. ఇటీవలే ఈ సినిమాను రీరిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.
It has been 20 Years and "Venky" remains closest to my heart!!
— Sreenu Vaitla (@SreenuVaitla) March 26, 2024
It was an amazing experience that I always cherish..
The movie was full of crazy moments and memories!!
The way @RaviTeja_offl portrayed his character and supported me is simply awesome!!
I thank @ThisIsDSP,… pic.twitter.com/I08Ez5NDCL
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com