Aa Okkati Adakku OTT Release Date : ఆ ఒక్కటీ అడక్కు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లరి నరేశ్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. మల్లి అంకం తెరకెక్కించిన ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వైవా హర్ష, అరియానా కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు.
చాలా కాలం తర్వాత సీరియస్ డ్రామాస్ నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ కామెడీ ట్రాక్ లోకి వచ్చి అల్లరి నరేష్ చేసిన లేటెస్ట్ చిత్రమే “ఆ ఒక్కటీ అడక్కు”. యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా దర్శకుడు మల్లి అంకం తెరకెక్కించిన కామెడి మరియు సందేశాత్మక చిత్రం ఇది. ఈ సినిమా కథ బాగున్నా కథనంలో కొత్తదనం లేకపోవడంతో యావరేజ్ గా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా మే 31 న స్ట్రీమింగ్ రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.త్వరలోనే మేకర్స్ ఓటిటి రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com