Aamani : నా భర్తతో విడాకులు తీసుకోలేదు.. కానీ: ఆమని
1990ల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందిన నటి ఆమని. అయితే.. ఆమె విడాకులు తీసుకున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను, తన భర్త వేర్వేరుగా ఉంటున్నామని, ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆమని తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ను పెళ్లి చేసుకోగా.. వీరికి బాబు, పాప ఉన్నారు.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమె మళ్లీ సినిమాలు చేస్తున్నారు. తనకు సినిమాలంటే ఇష్టమని, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని... అందుకే విడిపోవాలనుకున్నామని ఆమని చెప్పారు. విడాకులు తీసుకోకపోయినా... ఒక అండర్ స్టాండింగ్ తో విడిపోయామని తెలిపారు.
‘జంబలకిడి పంబ’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఆమని అందరికీ సుపరిచితమే. ఆమె శుభలగ్నం,మిస్టర్ పెళ్లాం,శ్రీవారి ప్రియురాలు,మావి చిగురు వంటి చిత్రాల్లో నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్ అయ్యింది. కాగా తమిళంలోనూ అనేక హిట్ సినిమాల్లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com