నా సామిరంగా.. ఆషికా జోరు మామూలుగా లేదుగా.. ఏకంగా చిరు సినిమాలో!

సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం లేదన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తోంది ఆషికా రంగనాథ్. కుర్ర హీరోయిన్ అయినప్పటికీ.. సంక్రాంతి బ్లాక్ బస్టర్ నా సామిరంగా మూవీలో నాగార్జున పక్కన కిర్రెక్కించింది. ఆలాగే సీనియర్ హీరోలకు సూటబుల్ హీరోయిన్ అనిపించుకుంది.
దానికి తగ్గట్టుగానే ఆషికాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా చిరంజీవి సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'కు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మరికొంతమంది కథానాయికలకు చోటుంది. ఓ నాయికగా… మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం.
విశ్వంభరలో నాయకికి, హీరో అక్కచెల్లెళ్ల పాత్రలకు కూడా కీలకమైన ప్రాధాన్యత ఉంటుది. అలాంటి కీలకమైన పాత్ర కోసం ఆషికాని తీసుకొన్నారట. ఐతే.. హీరోకు జోడీగానా.. లేక కీలకమైన సిస్టర్స్ పాత్రల్లోనా అనేది తేలాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com