Kiran Abbavaram : హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడంటే ?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పెళ్లి చేసుకోనున్నారు. హీరోయిన్ రహస్య గోరఖ్‌ను ఆయన వివాహమాడనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. కిరణ్ నటించిన తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’లోని హీరోయిన్‌నే పెళ్లి చేసుకోనుండటం విశేషం. వీరి నిశ్చితార్థం కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య బుధవారం జరగనున్నట్లు సమాచారం. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలెక్కనున్నారని తెలుస్తోంది.
కిరణ్ అబ్బవరం మామూలుగా తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరనే విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనుందట.
ఇక కిరణ్ అబ్బవరం మాత్రం హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాతో కెరీర్ లో మొదటి బ్రేక అందుకున్న ఈ హీరో.. చాలా కాలం తరువాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ బాట పట్టాడు. ప్రస్తుతం "దిల్ రూబా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దీనితో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com