Hero Suhas : హీరో సుహాస్‌కు కొత్త రోగం.. ఇండస్ట్రీలో బజ్

Hero Suhas : హీరో సుహాస్‌కు కొత్త రోగం.. ఇండస్ట్రీలో బజ్

టాలీవుడ్ న‌టుడు సుహాస్ (Suhas) వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. మ‌రో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ముందుకువ‌స్తున్నాడు. సుహాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ మూవీ టీజర్ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది.

ప్రసన్న వదనం సినిమాకు అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజ‌ర్ గ‌మ‌నిస్తే.. సుహాస్ ఈ సినిమాలో ఫేస్ బ్లైండ్‌నెస్ అనే వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి వ‌చ్చిన వారు.. ఓ వ్యక్తికి సంబంధించిన మొహం తప్ప అన్నీ గుర్తుప‌డ‌తారు. ఈ వ్యాధి ఉన్న సుహాస్‌కు అనుకోకుండా ఒక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. ఆ సమస్య నుంచి సుహాస్ ఎలా బయటపడ్డాడు అనేది సినిమా స్టోరీ. ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story