Amala Paul : కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న అమలాపాల్

హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘2 హ్యాపీ కిడ్స్’ అని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె రెండు లవ్ సింబల్స్ పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ పాపను ఎత్తుకుని తీసుకున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
కాగా.. గతేడాది జూన్ నుంచే డేటింగ్‌లో ఉన్న అమలాపాల్ జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది.
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్, తెలుగు, తమిళ , కన్నడ భాషల్లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో తక్కువ సినిమాల్లో నటించినప్పటికి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. మొదట దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com