Actress Anjali : ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు : అంజలి

Actress Anjali : ఇప్పటికే నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు  : అంజలి

హీరోయిన్ అంజలి (Anjali) తన పెళ్లి వార్తలపై స్పందించారు. తాను నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగు సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు మళ్లీ ఐదోసారి చేస్తున్నారు. నేను వివాహం చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు వార్తలు రాశారు. ఈ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. పెళ్లి చేసుకుంటా.. కానీ కొంత సమయం పడుతుంది’ అని ఆమె చెప్పారు.

ఇంకా స్పెషల్​ సాంగ్స్​ తాను ఎందుకు చేస్తున్నానో కూడా సమాధానం చెప్పింది అంజలి. స్క్రీన్ మీద వేసిన కొన్ని ఫోటోలను చూస్తూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. గేమ్​ ఛేంజర్​ సినిమా విషయంలో తనకు నరాలు పట్టేసినట్లు గుర్తుచేసుకుంది. తాను అల్లరి బాగా చేస్తానని చెప్పుకొచ్చింది. సీతమ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాట పాడి అలరించింది.

దాదాపుగా పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్‌ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం.

Tags

Read MoreRead Less
Next Story