Aparna Das : ఏప్రిల్ 24న ప్రియుడితో హీరోయిన్ అపర్ణా దాస్ పెళ్లి!

మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) ఫేమ్ దీపక్ పరంబోల్, హీరోయిన్ అపర్ణా దాస్ (Aparna Das) ఒక్కటవ్వనున్నారు. ఈ నెల 24న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీపక్, అపర్ణదాస్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతో ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 24న కేరళలోని (Kerala) వడక్కచేరిలో అపర్ణదాస్, దీపక్ పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. కాగా వీరిద్దరూ కలిసి ‘మనోహరం’ సినిమా చేశారు. తెలుగులో ‘ఆదికేశవ’ సినిమాలో అపర్ణ కీ రోల్ పోషించారు. ఆదికేశవలో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఆపర్ణదాస్‌కు నిరాశను మిగిల్చింది బీస్ట్, దాదా, జాయ్ ఫుల్ ఎంజాయ్ వంటి మలయాళ చిత్రాల్లో ఆమె నటించారు.
దీపక్ పరంబోల్ మలయాళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. 2010లో రిలీజైన మార్వాడీ ఆర్ట్స్ క్లబ్‌తో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన దీపక్ ఇప్పటివరకు వందకుపైగా సినిమాలు చేశాడు. గత ఏడాది మమ్ముట్టి హీరోగా నటించిన క్రిస్టోఫర్, కన్నూర్ స్వ్యాడ్‌లో దీపక్ సరోజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com