Actress Hema : హేమకు మళ్లీ పోలీసుల పిలుపు

Actress Hema : హేమకు మళ్లీ పోలీసుల పిలుపు
X

బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు సీసీబీ పోలీసులు. నటి హేమతో పాటు 8 మందికి రెండో నోటీస్ జారీ చేశారు. ఈనెల 27న పోలీసుల విచారణకు హేమ గైర్హాజరయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా కొంత సమయం కావాలని హేమ కోరారు. దాంతో జూన్‌ 1న తమ ముందు హాజరు కావాలని హేమకు పంపిన నోటీసులో సూచించారు.

అనారోగ్య సమస్యల కారణంగా సమయం కోరుతోంది హేమ ఇటీవల జ్వరం అంటూ సమయం వెసులుబాటు కోరింది. దీంతో జూన్ 1న తమ ముందు హాజరు కావాలని హేమకు నోటీసులు పంపారు అధికారులు. ఈసారి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags

Next Story