Kriti Kharbanda : పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నటి కృతి ఖర్బందా

ప్రముఖ బాలీవుడ్ నటి కృతి ఖర్బందా (Kriti Kharbanda), పుల్కిత్ సామ్రాట్ (Pulkith Samrat) మార్చి 15, 2024న ఢిల్లీలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. తాజాగా ఆమె అధికారిక వివాహ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో పాటు ఓ స్వీట్ క్యాప్షన్ ను కూడా రాసింది, "నా గుండె కొట్టుకునేది నీ కోసమే.. ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు నాతోనే ఉండాలి" అని రాసుకొచ్చింది.
ఈ ఫొటోలలో, కృతి పెళ్లికూతురుగా కనిపించింది. ఆమె పాస్టెల్ పింక్ లెహంగాపై భారీ ఎంబ్రాయిడరీని ధరించింది. మరోవైపు, పుల్కిత్, గాయత్రీ మంత్రం రాసిన పేస్ట్ గ్రీన్ షేర్వాణీని ధరించాడు. అంతకుముందు మార్చి 12, మంగళవారం, కృతి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ముంబై విమానాశ్రయంలో కనిపించింది. మరోవైపు పుల్కిత్ సోమవారం ఢిల్లీకి బయలుదేరారు.
ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, వాలెంటైన్స్ డే 2023 నాడు, కృతి, పుల్కిత్ మార్చి పెళ్లి గురించి సూచన చేశారు. ఇక కృతి, పుల్కిత్ ల ప్రేమకథ పాగల్‌పంటి సెట్స్‌లో వికసించింది. వారు 2019 లో డేటింగ్ ప్రారంభించారు. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్న శ్వేతా రోహిరాను పుల్కిత్ 2014లో వివాహం చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com