Leena : గగన్ యాన్ ఆస్ట్రొనాట్‌తో హీరోయిన్ పెళ్లి

కేరళ నటి లీనా (Leena) గగన్‌యాన్ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను (Prasant Balakrishnan Nayar) వివాహం చేసుకుంది. నటి ఫిబ్రవరి 27, మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ జంట జనవరి 17, 2024న వివాహం చేసుకున్నారు. గ్రూప్ కెప్టెన్ నాయర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో టెస్ట్ పైలట్. గగన్‌యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరిగా గ్రూప్ కెప్టెన్ నాయర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మోడీ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత లీనా.. ప్రశాంత్ నాయర్‌ని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో గర్వంగా ప్రకటించింది. భర్త ప్రశాంత్ నాయర్‌తో కలిసి ఆమె దిగిన ఫొటోల వీడియోను పంచుకుంటూ "ఈరోజు 27 ఫిబ్రవరి 2024న మన ప్రధాని మోదీ జీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామిగా ప్రకటించారు. ఇది దేశానికి, కేరళ రాష్ట్రానికి, అలాగే నాకు వ్యక్తిగతంగా గర్వకారణం'' అని క్యాప్షన్ ఇచ్చింది. తాము జనవరి 17న వివాహం చేసుకున్నారని, అయితే సీక్రసీ కోసం దానిని బహిర్గతం చేయలేకపోయారని ఆమె తెలిపారు.
లీనా ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా మలయాళ సినిమా, తమిళ సినిమాలలో కనిపిస్తుంది. 1976, ఆగస్టు 26న కేరళలోని తిరువాజియాడ్‌లో జన్మించిన గ్రూప్ కెప్టెన్ నాయర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డిఎ)లో చదివిన తర్వాత ఆకాశమార్గంలోకి వెళ్లాడు. Su-30 MKI, MiG-21 మరియు MiG-29తో సహా విభిన్న విమానాలలో సుమారు 3,000 గంటల ఫ్లైయింగ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com