Rajisha Vijayan : సినిమాటోగ్రాఫర్ తో జై భీమ్ హీరోయిన్ పెళ్లి!

కోలీవుడ్ హీరోయిన్ రజిషా విజయన్ త్వరలోనే సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. దీంతో వీరి వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రజిషా విజయన్, టోబిన్ థామస్ ఫస్ట్ టైమ్ కలిసి నటించిన చిత్రం ఖోఖో. 2021లో విడుదలైన ఈ సినిమాకు రాహుల్ రంజిత్ దర్శకత్వం వహించారు. క్రీడా పోటీల నేపథ్యంలో సాగే ఖోఖో చిత్రంలో రజిష తన నటనతో ఆకట్టుకుంది. ఆమె నటించిన లవ్లీ యువర్స్ వేద చిత్రానికి టోబిన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. మొత్తానికి చాలా కాలంగా సీక్రెట్ గా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.
రజిషా విజయన్ తెలుగులో మాస్ మాహారాజా రవితేజ జోడిగా రామరావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు తెరకు పరిచమయైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించకున్నా తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న ఆమె సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్ తో ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించక పోయినా ఆ మధ్య ఇటీవలే టోబిన్ థామస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీరిద్దరి చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతుందని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com