Tamannah : హీరోయిన్ తమన్నాకు సైబర్ సెల్ సమన్లు

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా సైబర్ చిక్కుల్లో పడింది. మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్‌ప్లే యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఎడిషన్ అక్రమ ప్రసారానికి సంబంధించిన కేసులో నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ విభాగం సమన్లు జారీ చేసింది. 'బాహుబలి' వంటి చిత్రాలలో తన పాత్రలతో గుర్తింపు పొందిన తమన్నాకు సమన్లు అందాయని వర్గాలు గురువారం తెలిపాయి.
తమన్నా ఏప్రిల్ 29న సైబర్ సెల్‌లో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులలో కోరారు అధికారులు. గతంలో ఇదే కేసులో రాపర్, గాయకుడు బాద్షాను విచారించారు. నటుడు సంజయ్ దత్‌కు ఈ వారం మంగళవారం నాడు సమన్లు వచ్చాయి, అతను డిపార్ట్‌మెంట్ ముందు హాజరు కావడానికి సమయం కోరాడు.
ఈ యాప్‌కు అధికారిక ప్రసార హక్కులు లేనప్పటికీ, ఈ నటీనటులు, గాయకులు అందరూ ఐపీఎల్ చూడటానికి ఫెయిర్‌ప్లే యాప్‌ను ప్రమోట్ చేశారు. ఇది అధికారిక ప్రసారకర్తలకు భారీ నష్టాలకు దారితీసింది. గతంలో Viacom18 కు రూ.100కోట్ల నష్టం వచ్చిందంటూ కంపెనీ చేసిన ఓ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. పాత కేసు కొనసాగుతోంది. కొత్తగా ప్రమోట్ చేసిన వారికి నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com