Naga Chaitanya : 10 ఏళ్ల తరువాత.. చైతూకు జోడీగా పూజా

‘విరూపాక్ష’ (Virupaksha) ఫేమ్ కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఓ సినిమా చేయనున్నారు. ఇందులో చైతూ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను (Pooja Hedge) ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన ఒక లైలా కోసం సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బోగవల్లి ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నమూవీపై పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ చిత్ర షూటింగ్‌లో చైతూ బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. అయితే ఈ బ్యూటీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమాల ఎంపికలో వేగం తగ్గించిన ఈబ్యూటీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో మిర్రర్ సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది. చిరునవ్వుతో అందాలను ఆరబోస్తున్న ఫోటోను షేర్ చేసింది పూజా. ఎత్తైన పోనీటెయిల్ తో వైట్ టాప్ తో మెరిసిపోయింది ఈ బ్యూటీ. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com