Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కి గాయం.. ఫ్యాన్స్ కంగారు

ముంబై: ఫ్రాన్స్ లో 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఫెస్టివల్ కు భారత్ తరఫున చాలా సార్లు ఐశ్వర్య రాయ్ ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది మాత్రం కియారా అద్వానీకి ఈ అవకాశం దక్కింది. కాగా ప్రతీ ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లే ఐశ్వర్య రాయ్.. ఇప్పుడు కూడా వెళ్లింది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో తన కూతురితో కలిసి కనిపించింది.
అయితే ఆమె కుడి చేతికి కట్టు ఉండటం గమనార్హం. ఇదికాస్త ఆమె అభిమానులను
ఆందోళనకు గురిచేస్తోంది. ఐశ్వర్య చేతికి ఉన్న కట్టు చూస్తుంటే తీవ్రమైన గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఐశ్వర్య రాయ్ కి అసలేమైందో తెలియక కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఐశ్వర్య గాయంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ తో పాటూ అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ సైతం సందడి చేయనున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com