Alia Bhatt : నాకు ఐశ్వర్య రాయ్ స్పూర్తి : అలియాభట్

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్. వరుస సినిమాల్లో నటిస్తూ.. తన హవాను కొనసాగిస్తోంది. హాలీవుడ్ సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అలియా.. తన ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఆ తర్వాత ఏకధాటిగా సినిమాలు చేస్తూ.. మంచి హిట్లు అందుకుంది. ఇక స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలియా భట్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. తనకు ఐశ్వర్య రాయ్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది. ఆమె సొంతంగా ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రపంచ స్థాయికి ఎదిగారని కొనియాడింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. పెళ్లై తల్లైన తర్వాత కూడా ఆలియా భట్ మూవీల్లో రాణిస్తోంది. గత ఏడాదిలో ఈ భామ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే బాలీవుడ్ మూవీతో పాటు 'హార్ట్ ఆఫ్ స్టోన్' అనే హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం జిగ్రా అనే సినిమాలో నటిస్తోంది. అంతకుముందు 'గంగూబాయి కతియావాడి', 'ఆర్ ఆర్ ఆర్', 'డార్లింగ్స్', 'బ్రహ్మాస్త్ర' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com