Aishwarya Rajesh : అంతా విషాదమే.. అమ్మను చూసి ఎంతో నేర్చుకున్న : ఐశ్వర్య రాజేష్

Aishwarya Rajesh : అంతా   విషాదమే..  అమ్మను చూసి ఎంతో నేర్చుకున్న :  ఐశ్వర్య రాజేష్
X

కౌసల్య కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేశ్. ఇక్కడ తన తొలి సినిమాతోనే నటనతో మెప్పించి.. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఐశ్వర్య ఇప్పుడు కథానాయికగా వరుస సినిమాలు చేస్తుంది. గ్లామర్ పాత్రలు పక్కన పెట్టేసి కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలను ఎంచుకుంటుంది. అయినా టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందలేదు.

ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళ మూవీల్లో ఐశ్వర్య నటిస్తోంది. తాజాగా ఐశ్వర్య తన వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. తన తండ్రి ష్యూరిటీ మీద కొందరికి రుణాలు ఇప్పించాడని.. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో అప్పు తీసుకున్న వారంతా ఎగ్గొట్టారని తెలిపింది. దీంతో తన తల్లి ఓ ప్లాట్ అమ్మేసి అప్పులు తీర్చాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ ఎంతో కష్టపడి తనని, అన్నయ్యలను చదివించిందని చెప్పుకొచ్చింది.

అయితే ఆమె అన్నయలు చదువు పూర్తి చేసి ఉద్యోగానికి వెళ్తామనుకునే సమయంలోనే ఓ ప్రమాదంలో చనిపోయారని తెలిపింది. అప్పటికే దుఖంలో ఉన్న అమ్మని ఆ ఘటన మరింత కుంగదీసిందని పేర్కొంది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ఆమె ధైర్యంగా నిలబడిందని తెలిపింది. ఇలా అమ్మను చూసి చాలా నేర్చుకున్నట్లు ఐశ్వర్య పేర్కొంది. క తాను కూడా సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని.. ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది. అతి మంచితనం పనికిరాదని తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చింది.

Tags

Next Story