Ali Fazal : ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: అలీ ఫజల్

తాను నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని మీర్జాపూర్ సిరీస్ నటుడు అలీ ఫజల్ అన్నారు. తానొక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌నని.. దేశం తరఫున ఆడాలనేది తన లక్ష్యంగా ఉండేదని తెలిపారు. అయితే స్కూల్ డేస్‌లో భుజానికి అయిన తీవ్ర గాయం కారణంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘‘మీర్జాపూర్’ చేసినప్పుడు అది వర్కౌట్ అవుతుందని, ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటుందని మేము అస్సలు ఊహించలేదు. ఆ సిరీస్ రిలీజయ్యాక కొన్నిరోజుల పాటు ఎలాంటి టాక్ లేదు. వారం రోజుల తర్వాత షో ఊపందుకుంది. ఆనాటి నుంచి మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. విశేష ప్రేక్షకాదరణతో సూపర్‌హిట్ షోగా పేరు పొందింది. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి కంటెంట్‌తో ఎన్నో సినిమాలు, షోలు వస్తున్నాయి. అందువల్లనే దీనిలో యాక్ట్ చేయడానికి భయపడలేదు’’ అని అలీ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com