Alia Bhatt : క్రేజీ మూవీలో అలియా

కల్కి 2898 ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో ఇండియా టాప్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కల్కి 2 తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తో ఓ భారీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాకు సంబందించిన చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని టాక్. అయితే ఈ సినిమా కల్కి 2కి ముందు వస్తుందా లేదా తరువాతనా అనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com