Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త మీనన్!

Allu Arjun : అల్లు అర్జున్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్టులో సంయుక్త మీనన్!

సంయుక్త మీనన్.. తెలుగు మార్కెట్లో డిమాండ్ ఉన్న గ్లామర్ సరుకు. నటన, అందం రెండూ ఉన్న టాలెంటెడ్ హీరోయిన్ ఆమె. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఇప్పటివరకు ఆమె నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్టే. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు కూడా సంయుక్త మీనన్ తో సినిమాలు చేయాలి అని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

కళ్యాణ్ రామ్ తో ఆమె రెండు సినిమాలలో స్క్రీన్ షేర్ చేసుకుంది. రెండు కూడా మంచి హిట్ అందుకున్నాయి. కాగా గత కొంతకాలంగా సంయుక్త మీనన్ తెలుగు సినిమాలకు సైన్ చేయడం లేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సంయుక్త మీనన్.. ఇక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుంది అని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వబోతుంది అని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే వాటికి చెక్ పెట్టేసింది సంయుక్త.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్తా మీనన్ సెలెక్ట్ అయింది అన్న వార్తే ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story